రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిల సలహాలు, సూచనలు, సహకారంతో కోదాడ వ్యవసాయ మార్కెట్ ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నట్లు కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. శుక్రవారం మండలం బరాకత్ గూడెం లో వ్యవసాయ మార్కెట్ కు సంబంధించిన చెక్ పోస్ట్ ను ఆమె తనిఖీ చేశారు.
అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ, నియోజకవర్గం నుండి ధాన్యం కొనుగోలు చేసి లారీల పైన వెళ్లే వాహనదారులు చిమిర్యాల, బాలాజీ నగర్, బరాకత్ గూడెం వద్ద ఏర్పాటుచేసిన మార్కెట్ చెక్ పోస్ట్ ల వద్ద చెక్ కట్టి, మార్కెట్ జరిగే అభివృద్ధికి సహకరించాలని కోరారు.
కోదాడ మార్కెట్ లో శనివారం, ఆదివారం గొర్రెలు, పశువుల సంతకు వచ్చి పోయే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంత్రి, ఎమ్మెల్యేల సలహాలు, సూచనలతో తాగునీరు, పరిశుభ్రత కల్పించి, ప్రశాంతంగా రైతులు, వ్యాపారులు వచ్చి వ్యాపారాలు చేసుకునే విధంగా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. గతంలో సంతలో దళారుల వ్యవస్థ ఉండేదని, ఇప్పుడు సంతలో దళారుల వ్యవస్థ లేకుండా నేరుగా కొనుగోలుదారుడు, అమ్మకందారుడుకి వచ్చి సజావుగా వ్యాపారాలు చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు డైరెక్టర్ కాసర్ల కోటయ్య, చిలుకూరు మండల అధ్యక్షుడు కీత వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమంతు, జిల్లా కార్యదర్శి సామేలు, నడిగూడెం మండలం మాజీ వైస్ ఎంపీపీ బడేటి వెంకటేశ్వర్లు, మండల యూత్ అధ్యక్షుడు తక్కెళ్ళ సాయి, నాగుల్ పాషా, మహమూద్ రియాజ్, స్థానికులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.












