మండలం చెర్వుగట్టు గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకగా రెండు జతల నూతన వస్త్రాలను గ్రామ సర్పంచ్ నేతకానీ కృష్ణయ్య అందించారు. గ్రామ అభివృద్ధిలో సిబ్బంది సేవలను కొనియాడుతూ వారిని ప్రోత్సహించేందుకు ఈ బహుమతిని అందజేశారు.
మండలం చెర్వుగట్టు గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకగా రెండు జతల నూతన వస్త్రాలను గ్రామ సర్పంచ్ నేతకానీ కృష్ణయ్య అందించారు.
గ్రామ పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం కృషి చేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందిని ప్రోత్సహించేందుకు, పండుగ వేళ వారిలో ఆనందాన్ని నింపాలనే ఉద్దేశంతో సర్పంచ్ ఈ కానుకను అందించారు.
గ్రామ అభివృద్ధిలో పంచాయతీ సిబ్బంది సేవలు ఎంతో కీలకమని, వారి కృషిని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా సర్పంచ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అమనగంటి జలంధర్ రెడ్డి, వార్డ్ సభ్యులు రేగట్టే లక్ష్మమ్మ నర్సిరెడ్డి, రేగట్టే ప్రియాంక నరేష్ రెడ్డి, కమ్మంపాటి వెంకటయ్య, వంటేపాక శిరీష శివ, కార్యదర్శి నన్నూరి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












