మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన దొడ్డి సాగర్ అనే వ్యక్తి అప్పుల బాధతో క్రిమిసంహారక మందు తాగి మృతి చెందారు. ఈ దుర్ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబానికి చెరువుగట్టు మాజీ సర్పంచ్ మల్గ బాలకృష్ణ తన వంతు సహాయంగా రూ. 10,000 మానవత్వంతో మానవత్వంతో ఆర్థిక సాయం అందజేశారు.
అప్పుల బాధను తట్టుకోలేక దొడ్డి సాగర్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో మాజీ సర్పంచ్ మల్గ బాలకృష్ణ రూ. 10,000 నగదును అందజేశారు.
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో వారికి మనోధైర్యం కలగాలని మల్గ బాలకృష్ణ ఆకాంక్షించారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మానవత్వానికి నిదర్శనమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కంకల సతీష్, మర్రిమర్రినరసింహ, శేపూర్ పరమేష్, మర్రి శివ, గండ్రమళ్ల శ్రవణ్, కొమ్ము సాయి, తీగల యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘటన స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

