మండల కారోబార్లు, బిల్ కలెక్టర్ల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలో కొండ. వెంకటయ్య గౌరవ అధ్యక్షుడిగా, పాలె శేఖర్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
మండలం పరిధిలోని కారోబార్లు, బిల్ కలెక్టర్ల సమక్షంలో, వారి సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సర్వసభ్య తీర్మానం ద్వారా నూతన మండల గౌరవ అధ్యక్షుడిగా కొండ. వెంకటయ్య (నార్కెట్ పల్లి మేజర్ గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్), అధ్యక్షులుగా పాలె శేఖర్ (ఎల్లారెడ్డి గూడెం గ్రామ పంచాయతీ కారోబార్), ఉపాధ్యక్షులుగా మాగి.నరసయ్య (శాపల్లి గ్రామ పంచాయతీ కారోబార్), ప్రధాన కార్యదర్శిగా గ్రామోజు వెంకటాచారి (అవురవాణి గ్రామ పంచాయతీ కారోబార్), కార్యదర్శిగా పెండెం వెంకటేశ్వర్లు (నెమ్మాని గ్రామ పంచాయతీ కారోబార్), కోశాధికారిగా ఏనోతుల శివ శంకరప్ప (అక్కెనపల్లి గ్రామపంచాయతీ కారోబార్) బాధ్యతలు స్వీకరించారు.
ఈ కీలక సమావేశంలో పలువురు ఇతర గ్రామ పంచాయతీ కారోబార్లు, బిల్ కలెక్టర్లు కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల కమిటీ సభ్యులు పత్రికా ప్రకటన ద్వారా, తెలంగాణ ప్రజా పాలనా ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న కారోబార్, బిల్ కలెక్టర్ల సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాలని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరారు.











