నల్గొండ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టే మల్లికార్జున రెడ్డి, మాజీ సర్పంచ్ మల్గ బాలకృష్ణ మండలం చెరువుగట్టు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మండలం చెరువుగట్టు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని నల్గొండ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టే మల్లికార్జున రెడ్డి పరామర్శించారు. చెరువుగట్టు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న పలువురిని రేగట్టే మల్లికార్జున రెడ్డి, మాజీ సర్పంచ్ మల్గ బాలకృష్ణ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న రేగట్టే వెంకటరెడ్డిని పరామర్శించారు. కాలు జారి కిందపడటంతో కాలికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న రేగట్టే వెంకటమ్మను పరామర్శించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న రేగట్టే రాములమ్మను పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.
మనిషికి కష్టమొచ్చినప్పుడు పలకరించే పలుకే కొండంత ధైర్యం, ఆప్యాయంగా పలకరించే మనసే నిజమైన మానవత్వం అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజల కష్టసుఖాల్లో తోడుగా, ఆప్యాయతకు చిరునామాగా రేగట్టే మల్లికార్జున రెడ్డి, మాజీ సర్పంచ్ మల్గ బాలకృష్ణ నిలుస్తున్నారని పలువురు అభివర్ణించారు.












