పురస్కరించుకుని (ధర్మ రథం) నవంబర్ 08
నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు, దీపావళి పండుగ సంబరాలను కొండారెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన పరిగి లక్ష్మమ్మ, పెబ్బె సుగుణమ్మ ఇళ్లలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు లబ్ధిదారుల ఇళ్లలో దీపాలు వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఒకప్పుడు సొంత ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పేద కుటుంబాలు నేడు ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి పండుగ జరుపుకోవడం సంతోషదాయకమని వారు పేర్కొన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేద కుటుంబాలకు ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని అందిస్తోందని నాయకులు అన్నారు.
ఇందిరమ్మ కమిటీ సభ్యులు పల్లె ఆనంద్ కుమార్, టీ. భాగ్యమ్మ, వట్టెల లింగం, మాజీ సర్పంచ్ రాజు, ఏర్పుల లింగం, వట్టెల సరిత.
కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు టీ. సుదర్శన్, మాజీ సర్పంచ్ పి. రాజు, వార్డు సభ్యులు పి. వెంకట్ రాంరెడ్డి, పి. మాధవులు, పీఏసీఎస్ డైరెక్టర్ ఏర్పుల లింగం, కారోబార్ పి. రాజు, సూరం శ్రీను, వట్టెల మల్లేష్, కే. యదోజి నవీన్ తదితరులు పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.
సొంత ఇంటి గడపలో వెలిగిన దీపాలు పేద కుటుంబాల జీవితాల్లో కొత్త ఆశలకు ప్రతీకగా నిలుస్తున్నాయని, ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేరాలనే ఆకాంక్షను ఈ సందర్భంగా నాయకులు వ్యక్తం చేశారు.











