Nalgonda/Nalgonda (ధర్మ రథం) జూలై 30
మహిళా శిశు, వికలాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్ జెండర్ సంక్షేమ శాఖ మరియు నల్గొండ జిల్లా పోలీస్ శాఖ సంయుక్తంగా నల్గొండ జిల్లాలో ట్రాన్స్ జెండర్ల సంక్షేమం, భద్రత, సంరక్షణ కోసం 'ప్రైడ్ ప్లేస్'ను ఏర్పాటు చేశాయి. ఈ కేంద్రం ద్వారా ట్రాన్స్ జెండర్లకు న్యాయపరమైన సహాయం, గుర్తింపు కార్డులు, ఆర్థిక స్వావలంబన వంటి సదుపాయాలు అందించనున్నారు.
మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల మరియు ట్రాన్స్ జెండర్ సంక్షేమ శాఖ, నల్గొండ జిల్లా పోలీస్ శాఖ సంయుక్తంగా నల్గొండ జిల్లాలోని ట్రాన్స్ జెండర్ల భద్రత, సంరక్షణ కోసం 'ప్రైడ్ ప్లేస్'ను ఏర్పాటు చేశాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు జిల్లా పోలీసు అధికారి రమేష్ మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలో ట్రాన్స్ జెండర్ల కోసం ప్రభుత్వం నూతనంగా ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయడం సంతోషదాయకమని తెలిపారు. న్యాయపరమైన హక్కులు, రక్షణ కోసం ఈ సెల్ ఏర్పాటు చేసి వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు.
జిల్లా సంక్షేమ అధికారిణి కేవీ కృష్ణవేణి మాట్లాడుతూ, ప్రభుత్వం గుర్తింపు కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పొదుపు సంఘాలు, ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తుందని తెలిపారు. జిల్లాలోని అందరూ గౌరవప్రదంగా జీవించేందుకు ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐ మంజుల, ఎస్సై అంజలి, మునగాల నాగిరెడ్డి (ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్), జిల్లా నాయకురాలు నందిని, నవీన్, జిల్లాలోని వివిధ ట్రైన్ సెంటర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.










