కూడ్లూర్, 7 September
రాయికల్ పట్టణంలో అర్హులైన విలేఖరులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి, ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, జర్నలిస్టుల కాలనీ ఏర్పాటు చేయాలని రాయికల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు తహసీల్దార్ కు వినతి అందించారు.
రాయికల్ లో జర్నలిస్ట్ లకు ఇండ్లు మంజూరు చేయాలి అర్హులైన విలేఖరులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేసి ఇండ్లు నిర్మాణం చేసి జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేయాలని రాయికల్ ప్రెస్ క్లబ్ [జాక్ ] అధ్యక్షులు చింతకుంట సాయికుమార్ ,ప్రధాన కార్యదర్శి సింగిడి శంకరయ్య కడకుంట్ల జగదీశ్వర్ లు అన్నారు రాయికల్ పట్టణంలో అనువైన ప్రదేశం డబుల్ బెడ్ వద్ద ఉన్న స్ధలాన్ని మరియు నిరుపయోగంగా డబుల్ బెడ్ రూమ్ ల సముదాయంలో మండల వ్యాప్తంగా వివిధ వార్త మాధ్యమాలలో పని చెస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా నిలిచినా జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్లు మంజూరు చేయవలసిందిగా మరియు నిరుపయోగంగా ఉన్న మధ్యలో నిలిచినా డబుల్ బెడ్ రూమ్ భవనలను ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వార పూర్తీ చేసి సీనియారిటీ ప్రతి పదికన జర్నలిస్టు లకు కేటాయించవలసిందిగా డిమాండ్ చేశారు ఇట్టి అంశంపై తహసీల్దార్ నాగార్జున సానుకూలంగా స్పందించారు ఇట్టి కార్యక్రమంలో ఎండి ముజఫర్ గుర్రాల వేణు , ఉపధ్యక్షులు యాచమనేని కిరణ్ కుమార్ సింగని శ్యామ్ సుందర్ , ఓరుగంటి భీమారాజ్,ఇమ్మడి విజయ్ ,కళ్లెం శ్రీనివాస్ మాలావత్ వెంకటేష్ ,గంట్యాల ప్రవీణ్ మహమ్మద్ షాకీర్ కోమటి రెడ్డి కృష్ణ రెడ్డి ,గంట్యాల ప్రవీణ్ ,మామడిపల్లి లక్ష్మన్ గట్టుపల్లి నరేష్ ,దుగ్యాల రమాపతి రావు ,మారుతి ,ఇర్పాన్ ,కొండ కళ్యాణ్ ఉరుమాండ్ల సంజీవ్ తదితరులు పాల్గొన్నారు












