జగిత్యాల జిల్లా కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కొని పరారైన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దొంగిలించిన పుస్తెలతాడుతో పాటు నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మల్యాల సి.ఐ రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, గంగారం తండా గ్రామానికి చెందిన అజ్మీర దూరి (50) ఉదయం సుమారు 9 గంటల సమయంలో సూరంపేట గ్రామ శివారులోని ఐకేపీ () కేంద్రంలో వడ్లు ఆరబెట్టేందుకు రోడ్డు మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో మోటార్ సైకిల్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలో ఉన్న సుమారు రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కొని అదే మోటార్ సైకిల్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో 04.11.2026 తేదీన నాచుపల్లి ఇటుక బట్టీల సమీపంలో హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్‌తో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో వారే ఈ దొంగతనానికి పాల్పడినట్లు నిర్ధారించారు. దీంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి చోరీ చేసిన బంగారు పుస్తెలతాడుతో పాటు నేరానికి ఉపయోగించిన హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఉపయోగించిన హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్ జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిప్పన్నపేట గ్రామంలో చోరీకి గురైన వాహనంగా గుర్తించారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అరెస్ట్ అయిన నిందితుల్లో గణేష్ (కోరుట్ల నివాసి) ఒకరు కాగా, మరో ఇద్దరు మైనర్లు కావడంతో వారి వివరాలను పోలీసులు వెల్లడించడం లేదు.











