ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి, జహీరాబాద్ (ధర్మ రథం) నవంబర్ 03
జహీరాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో వీడియో చిత్రీకరణ వివాదంలో అరెస్ట్ అయిన టీవీ 999 స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అధికారిక రిజిస్ట్రేషన్ లేని టీవీ 999 యాజమాన్యం తనకు నకిలీ ప్రెస్ ఐడీ కార్డు ఇచ్చి మోసం చేసిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

ప్రజా సమస్యలను వెలుగులోకి తేవాలనే మంచి ఉద్దేశంతోనే తాను ఛానల్లో చేరానని, అయితే గుర్తింపు లేని ఐడీ కార్డు ఇవ్వడం వల్ల ఇప్పుడు చట్టపరమైన రక్షణ కోల్పోయి, పోలీస్ కేసుల ముందు తీవ్రంగా నష్టపోయానని వాపోయారు. కొత్తగా జర్నలిజంలోకి రావాలనుకునే వారు కేవలం , గుర్తింపు పొందిన ప్రింట్ మీడియా, శాటిలైట్ ఎలక్ట్రానిక్ మీడియా లేదా అనుమతి ఉన్న కేబుల్ ఛానళ్లలోనే చేరాలని, తనలా నకిలీ కార్డులు నమ్మి ఎవరూ మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.
అధికారులకు విజ్ఞప్తి
అనుమతులు లేకుండా అక్రమంగా ప్రెస్ కార్డులు జారీ చేస్తూ నిరుద్యోగులను మోసగిస్తున్న టీవీ 999 ఛానల్‌పై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తనకు జరిగిన అన్యాయంపై జర్నలిస్టు సంఘాలు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ముందుకు వచ్చి న్యాయం చేయాలని చాంద్ పాషా కోరారు.