ఏలూరు కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. తిమ్మాపురంలో గిడ్డంగి ఏర్పాటుకు ఎన్ఓసీ ఇవ్వాలంటే లంచం ఇవ్వాల్సిందేనా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఎన్ఓసీ కోసం లక్ష రూపాయలు డిమాండ్ చేయగా, 30 వేలకు బేరం కుదిరింది.

ఈ క్రమంలో, లంచం తీసుకుంటుండగా ఏఈఈ సీతారామచంద్రమూర్తిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.