కోనరావుపేట (ధర్మ రథం) ఆగస్టు 13
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో దారుణ హత్యాయత్నం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెద్దగొల్ల సత్తయ్యపై అదే గ్రామానికి చెందిన సామల శ్రీనివాస్ పారాతో దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

తీవ్ర గాయాలతో ఆసుపత్రికి
ఒంటరిగా ఉన్న సత్తయ్యపై శ్రీనివాస్ పారాతో తలపై బలంగా కొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో సత్తయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న సత్తయ్య, తీవ్ర గాయాలతో బైక్పై కోనరావుపేట చేరుకుని, అక్కడి నుంచి చికిత్స కోసం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు.
మెరుగైన చికిత్స కోసం తరలింపు
అయితే, సత్తయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.
పోలీసులకు ఫిర్యాదు
ఈ దారుణ ఘటనపై బాధితుడు సత్తయ్య కుటుంబ సభ్యులు కోనరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది.