హైదరాబాద్, 2026-06-05
హైదరాబాద్లోని రాజేంద్రనగర్, న్యూ ఫ్రెండ్స్ కాలనీలో తెలంగాణ రాష్ట్ర చేనేత కార్పొరేషన్ వైస్ చైర్మన్ బక్కని అనిత ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
హైదరాబాద్లోని రాజేంద్రనగర్, న్యూ ఫ్రెండ్స్ కాలనీలో తెలంగాణ రాష్ట్ర చేనేత కార్పొరేషన్ వైస్ చైర్మన్ బక్కని అనిత ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు నల్ల మాద ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి సతీష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు కిరణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర సేవా కార్యదర్శి డాక్టర్ కోడుమూరు దయాకర్ రావు పాల్గొన్నారు.
అమ్మవారి ఆశీస్సులు
ఈ సందర్భంగా డాక్టర్ కోడుమూరు దయాకర్ రావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో జరిగే బోనాల పండుగలాగే ఈ కాలనీలోనూ అందరూ కలిసికట్టుగా పండుగను నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, కార్యక్రమ నిర్వాహకురాలు అనిత ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు.
అతిథుల హాజరు
ఈ వేడుకలకు సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ యర్రమాద కృష్ణారెడ్డి, వైశ్య వికాస వేదిక సలహాదారులు నంగునూరు రమేష్, వేముల మురళి, వినియోగదారుల హక్కుల జాతీయ నాయకులు మల్లేశ్వరరావు, కాలనీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, పెద్దలు హాజరయ్యారు. వీరంతా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పోతరాజు, ఆంజనేయ స్వామి, శివుడు, వేశాధారణతో నృత్యాలు చేసిన వారికి నిర్వాహకులు అతిధుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.











