రాయికల్, 2026-06-05
రాయికల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ముదిరాజ్ సంఘం సన్మానం
ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం సభ్యులు, ముఖ్య అతిథులుగా విచ్చేసిన జీవన్ రెడ్డి, వసంత సురేష్ లను శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. దేవాలయ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.
పలువురు నాయకుల హాజరు
ఈ భూమి పూజ కార్యక్రమంలో రాయికల్ మున్సిపల్ చేర్మెన్ కటకం రవి, కౌన్సిలర్లు బత్తిని మహేశ్వరి నాగరాజు, రాణి సాయికుమార్, బర్కం మల్లేష్, గోపి రాజిరెడ్డి, బత్తిని భూమన్న, కొయ్యేడి మైపాల్, సర్పంచులు నల్లాల స్వామి, గుమ్మడి సంతోష్, ఉప సర్పంచ్ సుధీర్ తో పాటు పలువురు స్థానిక నాయకులు, ముదిరాజ్ సంఘం సభ్యులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.