హైదరాబాద్, 2024-07-17
నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలు, పేపర్ లీకేజీలు, అవకతవకలకు నిరసనగా, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీలు జులై 24న రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు బుధవారం హిమాయత్‌నగర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు బంద్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన వరుస వైఫల్యాలు, పేపర్ లీకేజీలు, అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్యవేదిక (ఏఐఎస్ ఎఫ్, ఎస్ఎఫ్ఎ, ఎన్ఎస్ యూఐ, పీడీఎస్ యూ, ఏఐఎఫ్ డీఎస్, ఏఐఎస్బీ, ఏఐపీఎస్యూ) తెలంగాణ రాష్ట్ర కమిటీలు జులై 24న రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి.
బుధవారం హిమాయత్‌నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కె.మణి కంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ (ఏఐఎస్ఎఫ్), టి.నాగరాజు (ఎస్ఎఫ్ఎ), వెంకటస్వామి (ఎన్ఎస్ఈయూఐ), పల్లె మురళీ (ఏఐఎఫ్ డీఎస్) లు బంద్‌కు సంబంధించిన విషయాలపై మాట్లాడారు.










