Karimnagar/Karimnagar Rural (ధర్మ రథం) జూలై 30
ప్రభుత్వ నిధులు, వనరుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 'ఒక అధికారికి-ఒకే కారు' విధానాన్ని అమల్లోకి తెస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ నిధులు, వనరుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 'ఒక అధికారికి-ఒకే కారు' విధానాన్ని అమల్లోకి తెస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
సీనియర్ అధికారులు లేదా ఇతర శాఖల అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులు ఎవరైనా సరే, కేవలం ఒకే ప్రభుత్వ వాహనాన్ని వినియోగించాలని స్పష్టం చేసింది. ఒకే వ్యక్తి పేరుతో ఒకటి కంటే ఎక్కువ వాహనాలు కేటాయించడానికి వీలులేదు. అదనపు ఛార్జ్ ఉన్నప్పటికీ ఇప్పటికే కేటాయించిన వాహనాన్నే వాడుకోవాలని తేల్చిచెప్పింది.
కేంద్ర ప్రభుత్వ అధికారులు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, స్వయంప్రతిపత్తి సంస్థలు మరియు పాక్షిక ప్రభుత్వ సంస్థలకు చెందిన వాహనాలను సాధారణ విధులకు వినియోగించడాన్ని నిషేధించారు. కేవలం అధికారిక పర్యటనలు, ప్రత్యేక విధుల్లో ఉన్నప్పుడు మాత్రమే వాటిని ఉపయోగించేందుకు మినహాయింపు ఉంటుంది.
వినియోగంలో లేని లేదా మిగులుగా ఉన్న ప్రభుత్వ వాహనాలను అనధికారిక అవసరాలకు వాడకుండా, వాటిని సురక్షితంగా భద్రపరచాలని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలను కేంద్రం ఆదేశించింది.
ప్రభుత్వ ఆస్తుల వినియోగంలో పారదర్శకతను పెంచడంతో పాటు ప్రజాధనం వృథా కాకుండా చూసేందుకే ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలకు సూచించారు.







