Suryapet/Nadigudem (ధర్మ రథం) నవంబర్ 22
కాగిత రామచంద్రపురం గ్రామ పంచాయతీలో పదేళ్లుగా నిరుపయోగంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ టవర్ తొలగింపునకు సర్పంచ్ చక్రాల ఉమా పిచ్చయ్య అధికారులను కోరారు.
కాగిత రామచంద్రపురం గ్రామ పంచాయతీ ఆవరణలో పదేళ్లుగా నిరుపయోగంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ టవర్ సమస్యగా మారిందని, దానిని సాధ్యమైనంత త్వరగా తొలగించాలని సర్పంచ్ చక్రాల ఉమా పిచ్చయ్య అధికారులను కోరారు. ఆదివారం ఆమె ఒక ప్రకటనలో మాట్లాడుతూ, గత పదేళ్లుగా ఎలాంటి వినియోగం లేకుండా ఉన్న టవర్ పంచాయతీ ఆవరణలో స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా పలు సమస్యలకు కారణమవుతోందని తెలిపారు. గ్రామ పంచాయతీ నిత్య కార్యకలాపాలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు సైతం ఇది అడ్డంకిగా మారిందన్నారు.
నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి అవసరమైన స్థలం లేకపోవడంతో టవర్ తొలగింపు మరింత అవసరంగా మారిందని ఆమె పేర్కొన్నారు. నిరుపయోగంగా ఉన్న టవర్ను అలాగే ఉంచడం వల్ల పంచాయతీకి ఎలాంటి ప్రయోజనం లేదని, పైగా అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని ఆమె తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి, సమస్య తీవ్రతను గుర్తించి, టవర్ను సాధ్యమైనంత త్వరగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.







