జగిత్యాల, 22 October
జగిత్యాల పట్టణంలో సీఎం సహాయనిధి కింద ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 111 మంది లబ్ధిదారులకు రూ.52,04,450 విలువైన చెక్కులను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకుంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ సహాయం అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు.
జగిత్యాల పట్టణంలోని మోతే లోని జిల్లా పార్టీ కార్యాలయంలో, సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.52,04,450 విలువైన చెక్కులను జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ 111 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారు మాట్లాడుతూ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందని అన్నారు. చికిత్స ఖర్చుల భారంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తూ భరోసా కల్పిస్తోందని ఆయన తెలిపారు.
జగిత్యాల నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం సహాయనిధి ద్వారా సహాయం అందేలా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజంగి నందయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మెన్ గడ్డం నారాయణ రెడ్డి, పాక్స్ చైర్మెన్ దామోదర్ రావు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ అడువల జ్యోతి లక్ష్మణ్, టీపీసీసీ సెక్రటరీ బండ శంకర్, గట్టు సతీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.











