జడ్చర్ల, 19 November
సేవ చేయాలనే సంకల్పానికి విరామం ఉండదని మా కృపా చారిటబుల్ ట్రస్ట్ నిరూపిస్తోంది.
సేవ చేయాలనే సంకల్పానికి విరామం ఉండదని మా కృపా చారిటబుల్ ట్రస్ట్ నిరూపిస్తోంది. జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చే గర్భిణీ మహిళలు, వారి సహాయకుల ఆకలి బాధను గుర్తించి, ప్రతి బుధవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం విజయవంతంగా 23వ వారానికి చేరుకుంది. ట్రస్ట్ వ్యవస్థాపకులు మావిళ్ల కృష్ణ (కిట్టు) గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకురాలు బాల త్రిపుర సుందరి ముఖ్య అతిథిగా హాజరై, అన్నదాన సేవలో పాల్గొన్నారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణీ మహిళలు వైద్య పరీక్షల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితుల్లో, భోజనం కోసం ఇబ్బందులు పడకూడదనే గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి బుధవారం ఎలాంటి విరామం లేకుండా సేవలను కొనసాగించడం విశేషం. మరో ప్రత్యేకత ఏమిటంటే.. ట్రస్ట్ సభ్యులే స్వయంగా వంటలు తయారు చేసి, పరిశుభ్రత పాటిస్తూ ప్రేమతో భోజనం వడ్డిస్తున్నారు. సేవలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో డి. వెంకటయ్య (లారీ), బి. నర్సింలు, బి. దిలీప్ కుమార్, కె. అనిల్ కుమార్, కె. సత్యనారాయణ, పి. రవి, పి. రాఘవేందర్, ఎం.డి. అబ్దుల్లా, ఎం.డి. ఖాజా మెయిన్ ఉద్దీన్, బి. శేఖర్, ఆర్.కె. కృష్ణ తదితరులు నిరంతరం సహకారం అందిస్తున్నారు. ఒక పూట భోజనం కోసం ఎదురుచూసే వారికి ఆప్యాయంగా అన్నం పెట్టడం వెనుక ఎంతో గొప్ప మానవత్వం దాగి ఉంది. ముఖ్యంగా మాతృత్వపు మధుర క్షణాల కోసం ఎదురుచూస్తున్న గర్భిణీ మహిళలకు ఈ సేవ ఎంతో ఊరటనిస్తోంది. ప్రచారం కోసం కాకుండా, సేవే లక్ష్యంగా కొనసాగుతున్న మా కృపా ట్రస్ట్ అన్నదాన కార్యక్రమం మరెన్నో వారాలు విజయవంతంగా కొనసాగాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.







