హైదరాబాద్, 26 September
ఆన్లైన్ డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయమయ్యే అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు మరోసారి హెచ్చరిస్తున్నారు. ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న సైబర్ కేటుగాళ్లు, తాజాగా హైదరాబాద్‌లో ఓ యువ లాయర్‌ను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయలు కాజేసిన ఘటన వెలుగు చూసింది.
ఆన్లైన్ డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయమయ్యే అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు మరోసారి హెచ్చరిస్తున్నారు. ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న సైబర్ కేటుగాళ్లు, తాజాగా హైదరాబాద్‌లో ఓ యువ లాయర్‌ను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయలు కాజేసిన ఘటన వెలుగు చూసింది.
సంఘటన వివరాలు:
హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల యువకుడు వృత్తిరీత్యా లాయర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆయనకు ఒక డేటింగ్ యాప్ ద్వారా కొందరు సైబర్ నేరగాళ్లు పరిచయమయ్యారు. ఈ పరిచయం కొద్దిరోజుల్లోనే మరింత ముందుకు సాగింది. ఈ క్రమంలోనే సదరు కేటుగాళ్లు బాధితుడితో ప్రైవేట్ చాట్లు, వీడియో కాల్స్ మాట్లాడించారు.
బ్లాక్మెయిల్ బెదిరింపులు:
బాధితుడితో జరిపిన ప్రైవేట్ చాట్లు, వీడియో కాల్స్‌కు సంబంధించిన సున్నితమైన స్క్రీన్షాట్లు, రికార్డులను నేరగాళ్లు భద్రపరిచారు. ఆ తర్వాత అసలు ఆట మొదలుపెట్టారు. ఆ వివరాలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని, బంధువులకు పంపిస్తామని బెదిరించి (బ్లాక్మెయిల్) డబ్బు డిమాండ్ చేశారు.
అప్పులు చేసి, ఫ్లాట్ అమ్మి:
ఈ బెదిరింపులకు తీవ్రంగా భయపడిపోయిన ఆ లాయర్, పరువు పోతుందన్న ఆందోళనతో సైబర్ నేరగాళ్లు అడిగినంత డబ్బు ఇస్తూ వచ్చారు. ఏకంగా 241 విడతల్లో మొత్తంగా రూ.4.91 కోట్లు వారి ఖాతాలకు బదిలీ చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నారు. అన్ని మార్గాలు మూసుకుపోయి, తీవ్ర మానసిక క్షోభకు గురైన తర్వాత బాధితుడు ధైర్యం చేసి సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.
బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులన్నీ అయిపోవడంతో ఆగకుండా, చివరకు తన సొంత ఫ్లాట్‌ను కూడా విక్రయించి మరీ ఆ నేరగాళ్ల డిమాండ్లను తీర్చినట్లు బాధితుడు వాపోయాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సోషల్ మీడియా లేదా డేటింగ్ యాప్‌లలో ఎవరితోనైనా పరిచయాలు ఏర్పరచుకునేటప్పుడు వ్యక్తిగత వివరాలను, ఫొటోలను అపరిచితులతో పంచుకోవద్దని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి బ్లాక్‌మెయిల్‌కు గురైతే లొంగిపోకుండా, వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు.


