*రాష్ట్రవ్యాప్తంగా (ధర్మ రథం) నవంబర్ 21
అగ్రిగోల్డ్ డిపాజిటర్ల బాండ్ల వెరిఫికేషన్ ప్రక్రియకు తెలంగాణ సీఐడీ శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలు, మండలాల వారీగా వెరిఫికేషన్ తేదీలు, కేంద్రాలు, అధికారుల వివరాలను ప్రకటించారు. సుమారు రూ.447 కోట్ల కుంభకోణంలో 1.65 లక్షల మంది బాధితులు ఉన్నారు.
అగ్రిగోల్డ్ డిపాజిటర్ల బాండ్ల వెరిఫికేషన్ ప్రక్రియకు తెలంగాణ సీఐడీ శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలు, మండలాల వారీగా వెరిఫికేషన్ తేదీలు, కేంద్రాలు, వెరిఫికేషన్ నిర్వహించే అధికారుల వివరాలను ప్రకటించారు.
సుమారు రూ.447 కోట్ల అగ్రిగోల్డ్ కుంభకోణంలో ముగ్గురు నిందితులను సీఐడీ ఇప్పటికే అరెస్టు చేసింది. ఈ వ్యవహారంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.65 లక్షల మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. బాధితుల డిపాజిట్ బాండ్ పత్రాలు, ఇతర ఆధారాల పరిశీలన కోసం ప్రత్యేక వెరిఫికేషన్ కార్యక్రమాన్ని చేపడుతోంది.
వెరిఫికేషన్ ప్రక్రియ వివరాలు
జిల్లాలు, మండలాల వారీగా వెరిఫికేషన్ తేదీలు, నిర్వహించే ప్రదేశాలు, బాధ్యతాయుత అధికారుల వివరాలతో కూడిన సమగ్ర షెడ్యూల్‌ను సీఐడీ విడుదల చేసింది. వెరిఫికేషన్‌కు హాజరయ్యే బాధితులు తప్పనిసరిగా అగ్రిగోల్డ్ డిపాజిట్ బాండ్ పత్రాలు, రశీదులు, గుర్తింపు కార్డులు వంటి అవసరమైన ఆధారాలను తీసుకురావాలని సూచించింది.
బాధితులు తమకు కేటాయించిన తేదీ, వెరిఫికేషన్ కేంద్రం వివరాలను పరిశీలించి, నిర్ణీత సమయంలో అధికారుల ఎదుట హాజరుకావాలని సీఐడీ కోరింది.
మీడియాకు విజ్ఞప్తి
అగ్రిగోల్డ్ బాధితులందరికీ ఈ సమాచారం చేరవేస్తూ, వెరిఫికేషన్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మీడియా సంస్థలు విస్తృత ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేసింది.
గమనిక
సీఐడీ విడుదల చేసిన జిల్లాల వారీ షెడ్యూల్, తేదీలు, కేంద్రాలు, అధికారుల వివరాల పట్టికను జత చేస్తున్నాము.


