మహబూబాబాద్, 13 September
నిన్న మొన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు ఉగ్గంపల్లి, చిన్న గూడూరు వద్ద అకేరు వాగులో భారీగా వరద నీరు చేరింది. రెండు సంవత్సరాల క్రితం తెగిపోయిన కట్టను డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ పట్టించుకోకపోవడంతో నీరంతా వృధాగా దిగువకు పోతోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
*నిన్న మొన్నటి నుండి కురుస్తున్న వర్షాలకు ఉగ్గంపల్లీ చిన్న గూడూరు అకేరు వాగులో భారీగా వరద నీరు.* *గత రెండు సంవత్సరాల క్రితం తెగిన కట్ట డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ పట్టించుకోకపోవడంతో వృధాగా క్రిందికి పోతున్న నీళ్లు.* *ఆకేరు పరివాహక ప్రాంతంలో నీటిని నమ్ముకుని బతుకుతున్న కొన్ని వేలమంది ప్రజలు.* *కట్ట తెగి రెండు సంవత్సరాలు దాటిన నేటి వరకు రిపేర్ చేపించని డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్.* *ఏలినో ప్రభావంతో దేశమంతటా నీళ్ల కోసం తండ్లాటపడుతున్న తరుణంలో, నిన్న మొన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి ఆకేరు వాగులో భారీగా వరద నీరు వచ్చింది.* *వారం రోజుల తర్వాత చూస్తే చుక్క నీరు కూడా ఉండని పరిస్థితి నెలకొని ఉన్నది. ఇలాంటి దుస్థితి కి కారణం డోర్నకల్ ఎమ్మెల్యే రామ్ చందర్ నాయక్ కే కారణం.* *తక్షణమే స్పందించి ఆనకట్ట నిర్మాణానికి పనులు ప్రారంభించక పోతే, డోర్నకల్ నియోజకవర్గం లో వచ్చే ఎన్నికల్లో ప్రజలు డిపాజిట్ రాకుండా చేయడం ఖాయం.* *తక్షణమే డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ స్పందించాలని లంగారాభేరి లంబాడి హక్కుల పోరాట సమితి (LZPS) జిల్లా అధ్యక్షుడు ఆంగోత్ చందులాల్ డిమాండ్ చేశారు.*

