మండలంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల పురోగతిపై మండల ప్రత్యేక అధికారి, సీఈఓ గౌతమ్ రెడ్డి అధ్యక్షతన మండల స్థాయి సమీక్షా జరిగింది. ఈ లో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పెండింగ్ పనులు, ప్రజలకు అందుతున్న సేవలను ఈ సందర్భంగా సమీక్షించారు.
మండలంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల పురోగతిపై మండల ప్రత్యేక అధికారి, సీఈఓ గౌతమ్ రెడ్డి అధ్యక్షతన మండల స్థాయి సమీక్షా నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఏటీఎం ఏ చైర్మన్ గంగా రెడ్డి, ఎంపీడీవో చిరంజీవి, ఎమ్మార్వో నాగార్జున, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, పీఏసీఎస్ చైర్మన్లు తదితరులు హాజరయ్యారు. లో వివిధ శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, పెండింగ్ పనులు, ప్రజలకు అందుతున్న సేవలను సమీక్షించారు. ఎల్ నినో ప్రభావం వల్ల వ్యవసాయ రంగంపై పడే ప్రభావంపై చర్చించారు. రైతులకు పంటల వైవిధ్యీకరణపై అవగాహన కల్పించి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. మండలంలోని అన్ని ఓహెచ్ఎస్ఆర్ (ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్లు) పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. తాగునీటి సరఫరా పైప్లైన్లలో ఉన్న లీకేజీలను గుర్తించి, వెంటనే అరికట్టాలని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి తాగునీటి సరఫరా పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న లో-వోల్టేజ్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. వంగిపోయిన లేదా దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను సరిచేయాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో డిటిఆర్ (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు) లను ఏర్పాటు చేయాలని సూచించారు.
గ్రామాల్లో డీవాటరింగ్, పారిశుద్ధ్య కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. పీఎం టీబీ ముక్తా భారత్ కార్యక్రమం కింద క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించి, అనుమానితులను గుర్తించి టీబీ పరీక్షలు చేయించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వీబీ-జీఆర్ఏఎం-జీ కార్యక్రమం కింద గ్రామ పంచాయతీలలో జలసిరి పనులను చేపట్టాలని సూచించారు. మొత్తం 318 పనుల జాబితాపై సమీక్ష నిర్వహించి, సంబంధిత గ్రామ పంచాయతీలు పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీ వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలను (వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్స్) రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. దీర్ఘకాలంగా పదవుల్లో కొనసాగుతున్న వీవో కార్యవర్గ సభ్యులకు సంబంధించి ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు. వీవో భవనాల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు, నిర్వహణ పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని సూచించారు. ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా సౌకర్యం కల్పించేలా రహదారుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీలకు ఆర్టీసీ బస్సు కనెక్టివిటీపై సమీక్ష నిర్వహించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సు సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ, అటవీ శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖ, పశుసంవర్ధక శాఖ తదితర శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని కూడా సమీక్షించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి, సీఈఓ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

