టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఫేజ్ 2లో భాగంగా మండలం పరిధిలోని శాయంపేట, పత్తిపాక గ్రామ పంచాయతీలలో మంగళవారం ఎక్స్-రే స్క్రీనింగ్, టీబీ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 170 మందికి ఎక్స్-రే పరీక్షలు చేశారు.
టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఫేజ్ 2 కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలం పరిధిలోని శాయంపేట గ్రామ పంచాయతీ, పత్తిపాక గ్రామ పంచాయతీలలో ఎక్స్-రే స్క్రీనింగ్, టీబీ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో పద్నాలుగు సంవత్సరాలు పైబడిన పిల్లల నుండి, మద్యపానం, ధూమపానం చేసేవారు, వృద్ధులు, బాధితులు, బాడీ మాస్ ఇండెక్స్ () 18 కంటే తక్కువ ఉన్నవారు, టీబీ కాంటాక్ట్ ఉన్నవారు వంటి అధిక అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉన్నవారికి ఎక్స్-రే, ఇతర పరీక్షలు నిర్వహించి, టీబీపై అవగాహన కల్పించారు.
పరీక్షల వివరాలు
మొత్తం పత్తిపాకలో 84 మందికి, శాయంపేటలో 86 మందికి ఎక్స్-రేలు తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా , జిల్లా టీబీ వైద్యధికారి డా. ప్రదీప్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ డా. సాయ కృష్ణ, డా. శశి, టీబీ స్టాఫ్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ శ్రీనివాస్, నోడల్ అధికారి చలపతి రావు, , , సబసెంటర్ లు, ఆశలు, ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ, ఎన్ఎంలు, రేడియోగ్రాఫర్లు మహేష్, సదానందం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

