వైద్య సేవల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే గర్భిణీలకు, వారి కుటుంబ సభ్యులకు అండగా మా కృప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారాంత అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ట్రస్ట్ వ్యవస్థాపకులు మావిళ్ల కిట్టు గురుస్వామి ఆధ్వర్యంలో బుధవారం 17వ వారం అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ప్రతి బుధవారం దూర ప్రాంతాల నుంచి వచ్చే గర్భిణీలకు, వారి వెంట వచ్చే కుటుంబ సభ్యులకు భోజనం అందిస్తూ మానవతా దృక్పథంతో ట్రస్ట్ సేవలు కొనసాగిస్తోంది. వైద్య సేవల కోసం ఇతర ప్రాంతాల నుంచి రావాల్సి వచ్చే సమయంలో భోజనానికి ఇబ్బంది పడకుండా వారికి అన్నదానం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఇప్పటికే 16 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సేవా కార్యక్రమం, తాజాగా 17వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు కిట్టు గురుస్వామి మాట్లాడుతూ.. గర్భిణీలకు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సమయంలో ఆహారం అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. సేవా కార్యక్రమాలను ఒకరోజుకే పరిమితం చేయకుండా ప్రతి వారం నిరంతరం కొనసాగించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
మా కృప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ అన్నదాన కార్యక్రమంపై పలువురు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి భోజనం అందిస్తూ, ఆపన్న సమయంలో అండగా నిలవడం ద్వారా మానవత్వానికి ప్రతీకగా ఈ సేవా కార్యక్రమం నిలుస్తోందని పలువురు పేర్కొన్నారు.
17వ వారం అన్నదానం కూడా విజయవంతంగా నిర్వహించి.. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కన్నా గొప్ప సేవ మరొకటి లేదనే సందేశాన్ని మా కృప చారిటబుల్ ట్రస్ట్ చాటిచెప్పింది.












