నారాయణపురం గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం కింద 360 రకాల పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ పుష్పావతి పిలుపునిచ్చారు. చెరువులు, కుంటలు, వివిధ రకాల షెడ్ల నిర్మాణం వంటి పనులు ఇందులో ఉంటాయని తెలిపారు.
గాంధీ జయంతి సందర్భంగా నారాయణపురం గ్రామంలో గ్రామసభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఈబీ రాంజీ కొత్త పథకం కింద 360 రకాల పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ పుష్పావతి కోరారు. చెరువులు, కుంటలు, కాన్ఫిడెన్స్ షెడ్లు, మేకల షెడ్లు, ల్యాట్రిన్ గదులు, కోళ్ల షెడ్లు, పందుల షెడ్లు, చెరువుల పూడిక వంటి అనేక రకాలైన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ గ్రామసభ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రత్యూష, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నాగిరెడ్డి వెంకటరెడ్డి, టిఆర్ఎస్ గ్రామ శాఖ నాగేందర, బిజెపి మూల బిక్షమారెడ్డి, మెడికల్ డిపార్ట్మెంట్, సంఘ బంధం అధ్యక్షురాలు, సంఘ బంధం సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామపంచాయతీ సిబ్బందితో పాటు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












