జగిత్యాల పట్టణంలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలను మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు మనోధైర్యం కలగాలని ఆమె ఆకాంక్షించారు.
పట్టణానికి చెందిన పాంపట్టి శివ, బట్టు శ్యాంసుందర్ కుటుంబాలను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. జగిత్యాల మున్సిపల్ రిటైర్డ్ ఉద్యోగి ఆవారి ఆనందం మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, జ్యోతి లక్ష్మణ్ విచారం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ, కుటుంబ సభ్యులను కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. వారి కుటుంబాలకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
పాల్గొన్న నాయకులు
ఈ పరామర్శ కార్యక్రమంలో జగిత్యాల ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, పిప్పరి శ్రీనివాస్, కస్తూరి గంగాధర్, మెరుగు సత్తన్న, తదితర నాయకులు పాల్గొన్నారు.








