అల్లిపూర్ పాక్స్ నూతన చైర్మన్ తంగెళ్ల రమేష్ మరియు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేకు కాంగ్రెస్ శ్రేణులు, రైతులు ఘన స్వాగతం పలికారు.
అల్లిపూర్ పాక్స్ నూతన చైర్మన్ తంగెళ్ల రమేష్ మరియు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ శ్రేణులు, రైతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాటిపెళ్ళి గంగారెడ్డి, సర్పంచ్ గౌతమి వెంకట రెడ్డి, పాక్స్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పాక్స్ డైరెక్టర్లు అడమాల కొండల్ రెడ్డి, పల్లి ఎల్లయ్య, దావనపల్లి నర్సయ్య, లోకిని రాజేందర్, దూలూరి సుజాత, దాసారపు వేణురావు, మహమ్మద్ రాయబోసు, ఆకుల రాజేశం, ఎవుసం నర్సయ్య, షేరి బాలయ్య, ఎనుగులమల్లేశం, మంగళారం వరమ్మ, నాయకులు కోల శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముఖీద్, సర్పంచులు, గ్రామ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

