తెలంగాణ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజే )లో సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులుగా గరిడేపల్లి రామును నియమిస్తూ నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర అధ్యక్షులు తొగరి కరుణాకర్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది.
తెలంగాణ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజే )లో సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులుగా గరిడేపల్లి రామును నియమిస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు తొగరి కరుణాకర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల గణేష్ ఈ నియామక ఉత్తర్వులను జారీ చేసినట్లు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బుంగ చాందిని తెలిపారు.
నూతనంగా నియమితులైన జిల్లా ఉపాధ్యక్షులుగా తమ హోదాలో తక్షణమే అధికారిక బాధ్యతలు చేపట్టాలని ఆమె సూచించారు. నియమ నిబంధనలను పాటిస్తూ, క్రమశిక్షణతో పనిచేయాలని, సంస్థ చేపట్టే తదుపరి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని ఆమె కోరారు. సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన గరిడేపల్లి రాముకు ఈ సందర్భంగా నాయకులు, సభ్యులు పలువురు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

