పోలీస్ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం కోదాడలోని హైస్కూల్ మైదానాన్ని చైర్ పర్సన్ తిరుపతమ్మ సుధీర్ చదును చేయించారు. మైదానంలో పిచ్చి మొక్కలు, రాళ్లు, గుంటలు ఉండటంతో యువకులు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు అందడంతో ఆమె వెంటనే స్పందించారు.
గ్రామం మండలంలోని, చుట్టుపక్కల గ్రామాల నుండి నిరుద్యోగ యువకులు పోలీస్ నియామకాలకు సిద్ధమవుతున్నారు. స్థానిక హై స్కూల్ గ్రౌండ్లో రన్నింగ్, జంపింగ్, వాకింగ్ చేయడానికి మైదానంలో పిచ్చి మొక్కలు పెరిగి, రాళ్లు తేలి, ప్రమాదకరంగా గుంటలు ఏర్పడ్డాయి. దీనివల్ల దెబ్బలు తగిలి, కాళ్లు చేతులు విరిగే ప్రమాదం ఉందని, రన్నింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉందని యువకులు విషయాన్ని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్‌కు తెలిపారు. వెంటనే స్పందించిన ఆమె, డోజర్ సహాయంతో మైదానాన్ని శుభ్రం చేయించి, యువకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యను పరిష్కరించారు. చెప్పిన వెంటనే సమస్యను పరిష్కరించిన చైర్ పర్సన్ తిరుపతమ్మ సుధీర్‌కు యువకులు, మార్నింగ్ వర్కర్స్ కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యోగ నియామకాలకు సిద్ధమవుతున్న యువతీ యువకులు ఉద్యోగాలు సాధించి, ఉన్నత శిఖరాలకు చేరుకొని, తల్లిదండ్రులకు, గ్రామానికి, చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. చదువుకునే నిరుపేద విద్యార్థులకు తన వంతుగా సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తానని చైర్ పర్సన్ తిరుపతమ్మ సుధీర్ యువకులకు తెలిపారు. వారి వెంట వ్యాయామ ఉపాధ్యాయుడు పల్లపు నాగేశ్వరరావు, ఎండి సమద్, మేకపోతుల దినేష్, మేకల సాయి వీరబాబు, రిటైర్డ్ ఉద్యోగులు మండవ వెంకటేశ్వర్లు, రణబోతు అప్పిరెడ్డి, యువకులు తదితరులు ఉన్నారు.






