చెర్వుగట్టు గ్రామంలో ఈరోజు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి పరీక్షల్లో భాగంగా కొంతమంది గ్రామ ప్రజలకు కంటి ఆపరేషన్ అవసరమని వైద్యులు సూచించారు.
వైద్యులు సూచించిన వారికి మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్లోని పుష్పగిరి హాస్పిటల్కు తరలిస్తున్నారు. అవసరమైన వారికి వైద్యుల సూచనల మేరకు ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించి, వారికి మెరుగైన కంటి చూపు అందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోంది.











