స్థానిక పట్టణ నవ్య బాలికల జూనియర్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబురాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను విద్యార్థినులు పేర్చి, నృత్యాలతో అలరించారు. మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థినులు వేషధారణ, నృత్యాలు చేశారు.
అనంతరం బతుకమ్మ పాటలతో, నృత్యాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ శ్రీపాద నరేష్, ప్రిన్సిపల్ డైరెక్టర్ గాలిపెల్లి ఈశ్వర్ కుమార్ లు విద్యార్థినులకు బతుకమ్మ పండగ ప్రాముఖ్యతను, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థినులు తమ సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.












