మండల కేంద్రంలో జాతీయ స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. ఈ నెల 11 నుంచి 21 వరకు దసరా పండుగ సందర్భంగా ఉత్తమ్ పద్మావతి ప్రీమియర్ లీగ్ 2026 పేరుతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ కరపత్రాలను సర్పంచ్ దున్నా శ్రీనివాస్, ఉప సర్పంచ్ నాగరాజు ఆవిష్కరించారు.
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ టోర్నమెంట్ జరగనుంది. ఏఎన్ఆర్ ఫౌండేషన్ సహకారంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడల విజయవంతానికి అందరూ సహకరించాలని, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సర్పంచ్ దున్నా శ్రీనివాస్ సూచించారు. టోర్నమెంట్ ప్రారంభానికి రాష్ట్ర మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి హాజరు కానున్నారని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బాణాల సతీష్ కుమార్, గంటేపంగు నాగార్జున తదితరులు పాల్గొన్నారు.











