సూర్యాపేట జిల్లా మండల కేంద్రంలో మహాకాళి యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ దున్న శ్రీనివాస్, ఉప సర్పంచ్ వెలుగూరి నాగరాజు, స్థానిక ఎస్సై తేజస్విని, ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
మహాకాళి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు నక్క సాయి, నక్క సందీప్, బొమ్మనమైన చందు, తుంగం మల్లికార్జున్ తో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అన్నదాన కార్యక్రమానికి హాజరైన ముఖ్యఅతిథులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులకు మహాకాళి యూత్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భోజనాలను అందరూ స్వీకరించారు.












