మండలం, చెరువుగట్టు గ్రామానికి చెందిన దొడ్డి సాగర్ మరణం ఆ గ్రామ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణం గ్రామ ప్రజలకు తీరని లోటుగా మిగిలింది.
చెరువుగట్టు గ్రామానికి చెందిన దొడ్డి సాగర్ అకాల మరణంపై గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు దిగ్భ్రాంతి చెందారు. ఈ సందర్భంగా, దొడ్డి సాగర్ పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు, గ్రామస్తులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నల్గొండ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, చెరువుగట్టు మాజీ సర్పంచ్ మల్గ బాలకృష్ణ, వార్డు సభ్యులు దాసోజు కోటి, మాజీ వార్డు సభ్యులు చొల్లేటి జ్ఞానేశ్వర్ చారి, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మనిషి దూరమైనా ఆయనతో గడిపిన జ్ఞాపకాలు ఎప్పటికీ మన హృదయాల్లో సజీవంగానే ఉంటాయని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు. ఓం శాంతి.

