రాజన్న సిరిసిల్ల జిల్లా మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన గూడెపు వంశిక జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైంది. నవంబర్ మొదటి వారంలో జమ్మూ కాశ్మీర్లో జరిగే ఈ పోటీలలో ఆమె పాల్గొంటుంది. ఈ విషయంపై స్పందించిన మంత్రి కేటీఆర్, ఆమెకు ఆర్థిక సహాయం అందించి, మంచి కోచింగ్ ఇప్పించేందుకు హామీ ఇచ్చారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన గూడెపు వంశిక జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైంది. నవంబర్ మొదటి వారంలో జమ్మూ కాశ్మీర్లో జరిగే ఈ పోటీలలో ఆమె పాల్గొంటుంది. ఈ విషయం BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ తొలి మంత్రివర్యులు, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు గారికి తెలియజేయగా, ఆయన మంచి మనసుతో స్పందించి, ఆమెకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, మంచి కోచింగ్ ఇప్పించడానికి ఒక మంచి అకాడమీలో చేర్పించి అన్ని విధాల సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఆమె ఆటలో మరింత రాణించి, జాతీయ స్థాయిలో ఎదగడానికి అన్ని విధాల ప్రోత్సహిస్తానని తెలిపారు. గ్రామస్థులు కేటీఆర్ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడిచెర్ల దేవయ్య, మాజీ వైస్ చెర్మన్ కొమ్మెట రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.











