జగిత్యాల , బీర్పూర్ మండలాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు రోడ్డు ప్రమాదం, నరాల సంబంధిత వ్యాధుల చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2.50 లక్షల చొప్పున ఆర్థిక సహాయం మంజూరైంది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు ఎల్ఓసీలను అందజేశారు.
జగిత్యాల మండలం మోతె గ్రామానికి చెందిన జుంబర్తి రాహుల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అతని తలకు శస్త్రచికిత్స అవసరమైంది. ఈ విషయాన్ని స్థానిక నాయకులతో కలిసి రాహుల్ కుటుంబ సభ్యులు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వెంటనే స్పందించి, రాహుల్కు నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.2.50 లక్షల విలువైన ఎల్ఓసీ మంజూరు చేయించారు. మంజూరైన ఎల్ఓసీని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుంబర్తి రాహుల్ కుటుంబ సభ్యులకు స్తానిక నాయకులతో కలసి అందజేశారు. ఈ సందర్భంగా రాహుల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
మరో లబ్ధిదారునికి సీఎం సహాయ నిధి
అదేవిధంగా, బీర్పూర్ మండల తుంగురు గ్రామానికి చెందిన చుంచు మల్లేశం నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ, చికిత్స చేయించుకునే స్తోమత లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దృష్టికి తీసుకురాగా, స్పందించిన ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి ద్వారా మల్లేశం చికిత్స నిమిత్తం రూ.2.50 లక్షల విలువైన ఎల్ఓసీ మంజూరు చేసి, ఈరోజు క్యాంపు కార్యాలయంలో మల్లేశంకు అందజేశారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జుంబర్తి శంకర్, కౌన్సిలర్ చీటి లక్ష్మీనారాయణ, పీఎస్ఎస్ డైరెక్టర్ జుంబర్తి శంకర్, శ్రీనివాస్ రావు, అంజన్న, కొలగానీ సత్యం, ఆరుముల్ల శంకర్, బంధ తిరుపతి, హరివంశీ, హరీష్, సురేష్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.












