వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన చైర్మన్ అరుట్ల మహేష్ రెడ్డి, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వ పెద్దలకు, నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తామని వారు తెలిపారు.
రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ, వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ నియామకంపై వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అరుట్ల మహేష్ రెడ్డి, నామాపూర్ సర్పంచ్ మాదాసు అనిల్, రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల బాల్ రెడ్డి, ఉప సర్పంచ్ తాడేపు కొమురయ్య, వైస్ చైర్మన్ సడిమెల్ బాలయ్య, ఏఎంసీ డైరెక్టర్లు గూడ సిద్ధారెడ్డి, అన్నమేని రాజు, గంత రాజు, పోచమ్మల వనిత, సద్ది మధు, ముక్క నరసింహులు, బత్తుల నవీన్, డాకూరి మహేందర్, ఊరటి ప్రశాంత్, కుంభాల యాదగిరి రెడ్డి, చేపూరి రమేష్, ఎదునూరి భాను, పోతారం వంశీ, మెగని వివేక్ తదితరులు పాల్గొన్నారు.



