మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు దున్న రవి ఇటీవల గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో, కోదాడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆయనను పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు దున్న రవి ఇటీవల గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో, కోదాడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా దున్న రవి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
కష్టకాలంలో పార్టీ నాయకులకు అండగా నిలవడం, వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటూ ఆత్మీయంగా పరామర్శించడం బీఆర్ఎస్ పార్టీ నాయకుల లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సమన్వయ సమితి అధ్యక్షులు అనంతుల ఆంజనేయులు, గ్రామ శాఖ అధ్యక్షులు బోనగిరి ఉపేందర్, వార్డ్ మెంబర్ దున్న మనీషా, ఎస్కే గౌస్, మేకల వీరబాబు, గంటపంగు సుదీప్, జలిల్, కాసా ఉపేందర్, నాగేశ్వరరావు, గంటెపంగు నాగర్జున, బడుగుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.









