రాజకీయ రంగం
వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన మేధావులు, ఉపాధ్యాయులు, వైద్యులు, జర్నలిస్టులు, ప్రజాస్వామ్యవాదులు హసన్పర్తిలోని మహాలక్ష్మి బ్యాంక్వెట్ హాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి మూకదాడులను నిర్మూలించండి అనే అంశంపై జరిగిన నియోజకవర్గ స్థాయి మేధావుల సదస్సులో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి తాజా మాజీ 66వ డివిజన్ గురుమూర్తి శివకుమార్ అధ్యక్షత వహించగా, బీజేపీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు మేధావులు భాగస్వాములు కావాలని, కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

