నార్కట్పల్లి, 12 November
మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన రేగట్టే రాములమ్మ గారు అనారోగ్యంతో మరణించారు. ఆమె మృతి పట్ల గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి పార్థివదేహానికి పలువురు ప్రముఖులు, గ్రామస్తులు నివాళులర్పించారు.
మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన రేగట్టే రాములమ్మ గారు ఈరోజు అనారోగ్యంతో మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాము.
వారి పార్థివదేహానికి పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు చెరువుగట్టు మాజీ సర్పంచ్ మల్గ బాలకృష్ణ, మాజీ వార్డు సభ్యులు చెల్లేటి జ్ఞానేశ్వర్ చారి.
ఈ కార్యక్రమంలో దయ్యాల స్వామి, దయ్యాల శంకర్, కొమ్ము సురేష్, కొమ్ము సాయి తదితర గ్రామస్తులు పాల్గొని, రాములమ్మ గారికి అశ్రునివాళులు అర్పించారు.







