హుజూర్నగర్ రూరల్, 12 November
చెరువుగట్టు గ్రామానికి చెందిన రేగట్టే రాములమ్మ అనారోగ్యంతో మరణించగా, ఆమె పార్థివ దేహానికి దేవస్థానం చైర్మన్ వారాల రమేష్, మాజీ చైర్మన్ రేగట్టే రాజశేఖర్ రెడ్డి, చైర్మన్ పున్నం యాదగిరి, జిల్లా నాయకులు రేగట్టే నవీన్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు గంటశేఖర్ తదితరులు పూలమాలలు వేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రేగట్టే రాములమ్మ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.







