నార్కట్‌పల్లి, 14 November
నార్కెట్‌పల్లి మండలం చెరువుగట్టు ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం పాఠశాలలోని 84 మంది విద్యార్థులకు 30,000 విలువైన ఒక జత స్కూల్ యూనిఫామ్‌లను దేవస్థాన చైర్మన్ వారాల రమేష్ పంపిణీ చేశారు.
కార్యక్రమ వివరాలు
ఈ కార్యక్రమంలో దేవస్థాన మాజీ చైర్మన్ రేగట్టే రాజశేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ అమనగంటి జలంధర్ రెడ్డి, వార్డ్ సభ్యులు కమ్మంపాటి వెంకటయ్య, రేగట్టే ప్రియాంక నరేష్ రెడ్డి, కూకుట్ల శ్రీకాంత్, వంటేపాక శిరీష శివ, పిట్టల నాగన్న, మాజీ వార్డ్ మెంబెర్ గంట శేఖర్, యువజన నాయకులు కొమ్ము మహేష్, ఉపాధ్యాయులు, గ్రామపంచాయతి కార్యదర్శి నన్నూరి రవీందర్ రెడ్డి, ఆశావర్కర్లు చీర పద్మ, చేపూరి మొగులమ్మ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి చిన్నారి చదువులో రాణించాలని, ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

