జగిత్యాల, 15 November
రాయికల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వజ్ర ఇవి టూ వీలర్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్ హాజరై, షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చెట్టే భార్గవ్‌కు చెందిన ఈ షోరూంను ప్రారంభించిన అనంతరం, ఆయనకు అడువాల జ్యోతి లక్ష్మణ్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కౌన్సిలర్ చెట్టే గంగాధర్, రాయికల్ కోఆప్షన్ మెంబెర్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ మోర హనుమాండ్లు, తాట్లవాయి సర్పంచ్ మల్లేశం, కోనాపూర్ గ్రామ అధ్యక్షుడు మల్లేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని, షోరూం యజమాని చెట్టే భార్గవ్‌ను అభినందించారు.