జగిత్యాల, 9 November
జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ జారీ చేశారు.
జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ నియామకం అయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ జారీ చేశారు.
ఈ సందర్భంగా అడువాల జ్యోతి మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకొని ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, మహిళా కాంగ్రెస్ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.
తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్యలకు కృతజ్ఞతలు తెలియజేశారు.



