ఢిల్లీ / చీరాల, 2026-06-05
2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా ఎదగాలంటే దేశ అంతర్గత భద్రత మరింత బలోపేతం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అక్రమ చొరబాట్లు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ ముప్పులు వంటి సవాళ్లను ముందుగానే గుర్తించి అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా ఎదగాలంటే దేశ అంతర్గత భద్రత మరింత బలోపేతం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అక్రమ చొరబాట్లు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ ముప్పులు వంటి సవాళ్లను ముందుగానే గుర్తించి అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్వహించిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు.
భవిష్యత్ భద్రతా వ్యూహంపై సూచనలు
ఈ సమావేశంలో అమిత్ షా భవిష్యత్ భద్రతా వ్యూహంపై కీలక సూచనలు చేశారు. వచ్చే 15-20 ఏళ్లలో దేశ భద్రతను ప్రభావితం చేసే పరిణామాలను ఇప్పటి నుంచే అంచనా వేసి వ్యూహాలను రూపొందించాలని భద్రతా, నిఘా సంస్థలను కోరారు.
అక్రమ వలసదారులపై తీవ్ర వ్యాఖ్యలు
అక్రమ వలసదారుల అంశంపై అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశం ధర్మశాల కాదు. ఈ దేశంలో నివసించే హక్కు కేవలం ఈ దేశ పౌరులకు మాత్రమే ఉంటుంది అని ఆయన అన్నారు. అక్రమ చొరబాట్లు దేశ భద్రతతో పాటు ఆర్థిక స్థిరత్వం, జనాభా సమతుల్యతకు కూడా ముప్పుగా మారే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
సరిహద్దు భద్రత పటిష్ఠం
భద్రతా వ్యవస్థలు అక్రమ చొరబాట్లను ముందుగానే గుర్తించి అడ్డుకోవాలని సూచించారు. దేశంలోని భూ సరిహద్దుల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టిందని హోంమంత్రి తెలిపారు. గత ఎనిమిది నెలల్లో సరిహద్దుల్లో ఉన్న అన్ని రాష్ట్రాలతో కేంద్రం చర్చలు జరిపిందని, నాలుగు స్తంభాల సరిహద్దు భద్రతా వ్యవస్థను రూపొందించినట్లు చెప్పారు. తక్కువ సమయంలో భారత్‌ను అక్రమ చొరబాట్ల నుంచి విముక్తి చేయడమే లక్ష్యమని అమిత్ షా పేర్కొన్నారు.












