27 నవంబర్ 26 ధర్మ రథం (ధర్మ రథం) నవంబర్ 27
కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి వెంట ఉన్న దాబాలపై పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు శుక్రవారం సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి వెంట ఉన్న దాబాలపై పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు శుక్రవారం సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతో పాటు, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా దాబాల యజమానులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం నిల్వ చేయడం, విక్రయించడం లేదా వినియోగదారులు మద్యం సేవించేందుకు అనుమతించడం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత యజమానులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇకపై కూడా పోలీస్, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో దాబాలపై నిరంతర నిఘా ఉంటుందని, ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. దాబాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ, పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరుట్ల పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.


