మధిర, 10 September
మండలం, ఇల్లూరు గ్రామంలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గ్రామంలోని ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాల్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
*ఇల్లూరులో వీధి కుక్కల బెడద* మండలం,ఇల్లూరు గ్రామంలో వీధి కుక్కల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాల్లో గుంపులుగా కుక్కలు సంచరిస్తుండటంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. రహదారులపై గుంపులుగా తిరుగుతున్న కుక్కల కారణంగా ద్విచక్ర వాహనదారులు కూడా అప్రమత్తంగా వెళ్లాల్సి వస్తోందని ప్రజలు పేర్కొంటున్నారు. గతంలో వీధి కుక్కల దాడుల ఘటనలు నమోదైన నేపథ్యంలో ఇల్లూరు గ్రామంలో కూడా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. వీధి కుక్కల నియంత్రణకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఇల్లూరు గ్రామస్థులు కోరుతున్నారు.

