Khammam/Madhira (ధర్మ రథం) నవంబర్ 27
మధిరలో జరగనున్న 4వ జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని సీనియర్ సివిల్ జడ్జి ఎన్.ప్రశాంతి, జూనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తి పిలుపునిచ్చారు.
మధిరలో జరగనున్న 4వ జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని మధిర కోర్టు సీనియర్ సివిల్ జడ్జి ఎన్.ప్రశాంతి, జూనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తి కోరారు. శుక్రవారం స్థానిక సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో నిర్వహించిన మెగా లోక్ అదాలత్ సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. లోక్ అదాలత్ విజయవంతానికి పోలీస్ సిబ్బంది, ఎక్సైజ్ అధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రజల న్యాయ వివాదాలు త్వరగా పరిష్కారం అయ్యేందుకు లోక్ అదాలత్ ఒక ప్రధాన వేదికగా నిలుస్తుందన్నారు. రాజీ పడదగ్గ కేసులైన క్రిమినల్, సివిల్, యాక్ట్, ప్రమాద బీమా, వివాహ, కుటుంబ తగాదాలు లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో క్లాస్ మేజిస్ట్రేట్ సలీం పాషా, న్యాయవాదులు అబ్రహం, మధురితేజ, రమేష్, సి. ఐ లు డి. మధు, డి. రమేష్, ఏ ఎస్ ఐ కే చంద్రశేఖర్, ఎస్ ఐ ప్రవీణ్ కుమార్, రవళి రెడ్డి, సందీప్, రవి, కోర్టు సూపరింటెండ్లు, పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


