జగిత్యాల, 8 September
జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని, ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో అట్టర్ ప్లాప్ అయింది. మాయ మాటలతో గద్దెనెక్కి 1000 రోజులు అయినా ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయలేదంటూ. ఎగవేతల ఏలిక చేసిన మోసం చాలికా అంటూ నినాదాలు చేస్తూ జిల్లా కేంద్రం లోని తహసీల్దార్ చౌరాస్త లో వున్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా, రాస్త రోకో నిర్వహించారు. ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ నాయకులు టీ. జీవన్ రెడ్డి, దావ వసంత, ఇతర ముఖ్య నాయకులు, గ్రామ సర్పంచ్ లు, మహిళలు పాల్గొన్నారు












